Narendra Modi: హోమ్‌మేడ్ మాస్కు ధరించిన ప్రధాని మోదీ

PM Narendra Modi uses homemade face mask during CMs meeting on Covid19
  • ముఖానికి మాస్కుతో  సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్
  • పలువురు ముఖ్యమంత్రులు కూడా
  • లాక్‌డౌన్ కొనసాగించడంపై ప్రధాన చర్చ
కరోనా వైరస్ నియంత్రణ చర్యలు, దేశంలో నెలకొన్న పరిస్థితులపై ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న మోదీ హోమ్‌మేడ్ ఫేస్ మాస్కు ధరించారు. తెల్లరంగు మాస్కును మోదీ తన ముఖానికి కట్టుకోగా, పలువురు ముఖ్యమంత్రులు కూడా మాస్కులు ధరించడం గమనార్హం. మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాక్రే సర్జికల్ మాస్కు ధరించగా.. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో పాటు ఆ రాష్ట్ర అధికారులు కూడా ముఖానికి మాస్కులతో కనిపించారు.

ఈ సమావేశంలో లాక్‌డౌన్‌ను కొనసాగించే అంశంపై కీలక చర్చ జరిగినట్టు సమాచారం. దీనిపై అందరు ముఖ్యమంత్రుల అభిప్రాయాలను మోదీ తీసుకున్నారు. లాక్‌డౌన్‌ను ఎప్పుడు, ఎలా ఎత్తివేయాలనే విషయంపై వారితో చర్చించినట్టు తెలుస్తోంది. లాక్‌డౌన్‌ను ఈ నెల చివరి వరకు కొనసాగించాలని పలువురు సీఎంలు మోదీకి సూచించినట్టు సమాచారం.
Narendra Modi
uses
face mask
home made
CMs meeting

More Telugu News