Dharmendra: మనుషులు చేసిన చెడు పనులే దీనికంతటికీ కారణం: ధర్మేంద్ర

Corona is because of our sins says actor Dharmendra
  • కరోనాకు మనుషులు చేసిన పాపాలే కారణం
  • అందరూ మంచి జీవితాన్ని గడపండి
  • మీ యజమాని మీ కోరికలను నెరవేరుస్తారు
భారతీయ చలనచిత్ర రంగంలో బాలీవుడ్ సీనియర్ నటుడు ధర్మేంద్రది ఒక చెరిగిపోని స్థానం. ఎన్నో అద్భుత చిత్రాలతో ఆయన ప్రేక్షకులను అలరించారు. బాలీవుడ్ హీమాన్ గా పేరుగాంచారు. ప్రస్తుతం ఆయన ముంబై శివార్లలోని తన ఫామ్ హౌస్ లో ఉంటున్నారు.

తాజాగా కరోనా వైరస్ గురించి ఆయన స్పందించారు. మానవుల చెడు పనుల ఫలితమే కరోనా వైరస్ అని చెప్పారు. ప్రతి ఒక్కరూ మంచి వ్యక్తిగత జీవితాన్ని గడపాలని... మీ యజమాని మీ కోరికల్ని తీరుస్తారని అన్నారు. ఏప్రిల్ 5న దీపాలు వెలిగించాలంటూ ప్రధాని మోదీ పిలుపునిచ్చినప్పుడు ధర్మేంద్ర టార్చ్ వెలిగించారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
Dharmendra
Bollywood
Corona Virus

More Telugu News