Andhra Pradesh: కర్నూలును భయపెడుతున్న కరోనా.. నేడు కొత్తగా ఐదు కేసుల నమోదు

Five new cases registered in Kurnool district today
  • జిల్లాలో 82కు చేరిన కేసుల సంఖ్య 
  • రాష్ట్రంలో మొత్తంగా 386 కేసులు
  • బాధితులు మర్కజ్ మసీదుకు వెళ్లొచ్చిన వారి బంధువులే
ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాను కరోనా మహమ్మారి వణికిస్తోంది. తాజాగా ఈ రోజు మరో ఐదు కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో జిల్లా వ్యాప్తంగా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 82కు చేరింది. నేడు నమోదైన ఐదు కేసుల్లో బాధితులందరూ ఢిల్లీ మర్కజ్ మసీదుకు వెళ్లి వచ్చిన వారి బంధువులేనని కలెక్టర్ వీరపాండ్యన్ తెలిపారు. తాజా కేసులతో కలుపుకుని రాష్ట్రంలో మొత్తం నమోదైన కరోనా నిర్ధారిత కేసుల సంఖ్య 386కి చేరింది. ఇప్పటి వరకు పది మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ కాగా, ఇంకా 365 మంది వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కర్నూలు తర్వాత 58 కేసులతో గుంటూరు రెండో స్థానంలో ఉంది.
Andhra Pradesh
Kurnool District
Corona Virus

More Telugu News