Warangal Rural District: రోడ్డుపై ఉమ్మి వేసిన వ్యక్తిని అరెస్ట్ చేసిన వరంగల్ పోలీసులు

Warangal police arrest man who spit on road
  • రోడ్డుపై ఉమ్మి వేయడాన్ని నిషేధించిన ప్రభుత్వం
  • వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు
  • తెలంగాణ రాష్ట్రంలో తొలి కేసు

రోడ్డుపై ఉమ్మివేసిన వ్యక్తికి పోలీసులు అరదండాలు వేసిన ఘటన వరంగల్ జిల్లాలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. నగరానికి చెందిన కొప్పుల మొగిలి నిన్న పరకాల నుంచి హన్మకొండకు ఆటోలో వెళ్తున్నాడు. ఊరుగొండ సమీపంలో తనఖీల్లో భాగంగా పోలీసులు అతడి ఆటోను ఆపారు. 

ఆటో నుంచి దిగిన మొగలి పక్కనే ఉమ్మి వేశాడు. దీనిని తీవ్రంగా పరిగణించిన పోలీసులు బహిరంగ ప్రదేశంలో ఉమ్మి వేసినందుకు గాను అతడిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. కరోనా వైరస్‌ను కట్టడి చేసే చర్యల్లో భాగంగా ప్రభుత్వం రోడ్డుపై ఉమ్మి వేయడాన్ని నిషేధించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే మొగిలిని పోలీసులు అరెస్ట్ చేశారు. రోడ్డుపై ఉమ్మివేసినందుకు నమోదైన తొలి కేసు ఇదేనని చెబుతున్నారు.

Warangal Rural District
Police
Corona Virus
Spit

More Telugu News