Narendra Modi: నేడు సీఎంలతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్.. లాక్‌డౌన్ పొడిగింపుపై స్పష్టత

PM video conference with CMs today Clarity on lockdown extension
  • దేశంలో పెరుగుతున్న కేసులు, మరణాలు
  • లాక్‌డౌన్‌ను పొడిగిస్తే కొన్ని రంగాలకు మినహాయింపు
  • సీఎంలతో సమావేశం అనంతరం జాతిని ఉద్దేశించి మోదీ ప్రసంగం

దేశంలో కరోనా వైరస్ చెలరేగిపోతున్న నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్ గడువు మంగళవారంతో ముగియనుంది. లాక్‌డౌన్ విధించినప్పటితో పోలిస్తే కరోనా కేసులు, మరణాల సంఖ్య మరింత పెరిగిన నేపథ్యంలో దీనిని మరింత కాలం పొడిగించే అవకాశం ఉందన్న ఊహాగానాలు వెలువడుతున్నాయి. అయితే, పొడిగింపు ఉంటుందా? లేదా? అన్న విషయమై నేడు స్పష్టత రానుంది. 


ప్రధాని నరేంద్రమోదీ నేడు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో లాక్‌డౌన్ పొడిగింపుపై చర్చించనున్నారు. అనంతరం జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారు. లాక్‌డౌన్‌ను కనుక పొడిగిస్తే ప్రస్తుతం ఉన్న నిబంధనలను కొంతమేర సడలించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆర్థిక వ్యవస్థ తీవ్ర సంక్షోభంలోకి వెళ్లిపోతున్న నేపథ్యంలో కొన్ని రంగాలను లాక్‌డౌన్ నుంచి మినహాయిస్తారని సమాచారం. 

Narendra Modi
Lockdown
Corona Virus

More Telugu News