Tollywood: టాలీవుడ్ సీనియర్ నటుడు నర్సింగ్ యాదవ్‌‌కు తీవ్ర అస్వస్థత.. కోమాలో ఉన్నారన్న భార్య!

Tollywood Actor Narsing Yadav Hospitalised
  • నిన్న సాయంత్రం అపస్మారక స్థితిలోకి నర్సింగ్ యాదవ్
  • వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్న వైద్యులు
  • సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను నమ్మొద్దన్న నర్సింగ్ భార్య
టాలీవుడ్ సీనియర్ నటుడు నర్సింగ్ యాదవ్ తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చేరారు. నిన్న సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఇంట్లో ఒక్కసారిగా కుప్పకూలి అపస్మారక స్థితిలోకి వెళ్లిన ఆయనను వెంటనే సోమాజీగూడలోని యశోద ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన వెంటిలేటర్‌పై ఉన్నారని, పరిస్థితి విషమంగా ఉందని సమాచారం.

దీనిపై ఆయన భార్య చిత్ర మాట్లాడుతూ, తన భర్త నిన్న సాయంత్రం అపస్మారక స్థితిలోకి వెళ్లిన మాట నిజమేనని, ప్రస్తుతం కోమాలో ఉన్నారని తెలిపారు. ప్రస్తుతం వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నట్టు పేర్కొన్నారు. అయితే బయట ప్రచారం జరుగుతున్నట్టు కింద పడి గాయాలయ్యాయన్న వార్తలు నిజం కాదని, అకస్మాత్తుగా కోమాలోకి వెళ్లిపోయారని వివరించారు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను నమ్మొద్దని కోరారు.

Tollywood
Narsing Yadav
Hyderabad

More Telugu News