Sara Ali Khan: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం  

Sara Ali Khan opposite Mahesh
  • మహేశ్ బాబు చిత్రంలో బాలీవుడ్ భామ 
  • చరణ్ కి రాజమౌళి గ్రీన్ సిగ్నల్ 
  • మాస్ పాత్ర కోసం రవితేజ వర్కౌట్స్ 
 *  మహేశ్ బాబు హీరోగా పరశురాం దర్శకత్వంలో రూపొందే చిత్రంలోని హీరోయిన్ పాత్ర కోసం పలువురి పేర్లు తెరపైకి వస్తున్నాయి. నిన్నటివరకు కీర్తిసురేశ్, కైరా అద్వానీ పేర్లు ప్రచారంలో వుండగా తాజాగా సారా అలీఖాన్ పేరు కూడా వచ్చింది. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్, అమృతా సింగ్ ల కూతురైన సారా హిందీలో గ్లామరస్ తారగా పేరుతెచ్చుకుంది. మరి ఆమె మహేశ్ సరసన నటిస్తుందేమో చూడాలి.
*  చిరంజీవి, కొరటాల కలయికలో రూపొందుతున్న 'ఆచార్య' చిత్రంలో చరణ్ ఓ కీలక పాత్ర పోషించనున్నట్టు వార్తలొచ్చాయి. అయితే, ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రం పూర్తి కానందున చరణ్ 'ఆచార్య'లో చేయడం వీలుపడడం లేదని, ఆ కాంట్రాక్ట్ పూర్తయితేనే కానీ మరో చిత్రంలో చరణ్ నటించడానికి వీలులేదని కూడా ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో దర్శకుడు రాజమౌళి ఈ విషయంలో చరణ్ కు తాజాగా అనుమతి ఇచ్చినట్టు తెలుస్తోంది. అందుకు తగ్గట్టుగా చరణ్ డేట్స్ అడ్జస్ట్ చేసుకుంటున్నాడట.
*  రవితేజ తన తదుపరి చిత్రాన్ని రమేశ్ వర్మ దర్శకత్వంలో చేయనున్నాడు. ఇందులో రెండు పాత్రలను పోషిస్తూ ద్విపాత్రాభినయం చేయనున్నట్టు వార్తలొస్తున్నాయి. ఇందులో ఒకటి మాస్ పాత్ర అనీ, అందుకోసం మంచి బాడీ షేప్ కు ప్రస్తుతం జిమ్ లో తను బాగా వర్కౌట్స్ చేస్తున్నాడనీ సమాచారం.  
Sara Ali Khan
Mahesh Babu
Chiranjeevi
Charan
Raviteja

More Telugu News