Corona Virus: ఏపీలో క్వారంటైన్ లో ఉన్నవారికి బలవర్ధకమైన ఆహారం అందజేత

Special Diet for quarantined people in AP

  • ఏపీలో పలు చోట్ల క్వారంటైన్ కేంద్రాలు
  • కోడిగుడ్లు, డ్రైఫ్రూట్స్ తో స్పెషల్ డైట్
  • వ్యాధి నిరోధక శక్తి ఇనుమడిస్తుందన్నది భావన

ఏపీలో లాక్ డౌన్ నిబంధనలను కచ్చితంగా అమలు చేస్తున్నారు. విదేశాల నుంచి వచ్చినవారికే కాకుండా, ఇటీవల ఢిల్లీలో మర్కజ్ కు వెళ్లొచ్చినవారిని కూడా క్వారంటైన్ కేంద్రాలకు తరలిస్తున్నారు. కరోనా అనుమానితులను 14 రోజుల పాటు వివిధ ప్రాంతాల్లో ఉన్న క్వారంటైన్ కేంద్రాల్లో ఉంచుతున్నారు. అయితే, ఈ క్వారంటైన్ లో ఉన్నవారికి ఎలాంటి ఆహారం అందిస్తున్నారో ప్రభుత్వం వెల్లడించింది.

గన్నవరం, నూజివీడు, గంగూరు (విజయవాడ డివిజన్) క్వారంటైన్ కేంద్రాల్లో ఉన్నవారికి అరటిపండ్లు, కోడిగుడ్లు, బాదంపప్పు, జీడిపప్పు, ఎండుద్రాక్ష, ఎండు ఖర్జూరం వంటి బలవర్ధకమైన ఆహారం అందిస్తున్నారు. ఈ తరహా ఆహారంతో క్వారంటైన్ లో ఉన్నవారికి వ్యాధి నిరోధక శక్తి ఇనుమడిస్తుందన్నది వైద్యుల భావన. మొత్తమ్మీద కోడిగుడ్లు, డ్రైఫ్రూట్స్ లో స్పెషల్ డైట్ అందజేస్తున్నారు.

  • Loading...

More Telugu News