రూ.15,000 కోట్లతో కరోనా అత్యవసర ప్యాకేజికి కేంద్రం ఆమోదం
- రాష్ట్రాలపై కేంద్రం ఉదారత
- మార్చి 24న రాష్ట్రాలకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటన చేసిన మోదీ
- కరోనాపై తక్షణ పోరాటానికి రూ.7,774 కోట్లు
- మిగతా నిధులు నాలుగేళ్లలో వినియోగించుకునే వెసులుబాటు
కరోనాను ఎదుర్కొనేందుకు రాష్ట్రాల వైద్య, ఆరోగ్యవ్యవస్థలు మరింత పరిపుష్టం అవ్వాలన్న ఉద్దేశంతో ఈ ప్యాకేజీ తీసుకువచ్చారు. దీనిపై కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ మాట్లాడుతూ, ఈ నిధులతో రాష్ట్రాలు పీపీఈ సూట్లు, వెంటిలేటర్లు, మాస్కులు, ఇతర పరికరాలు కొనుగోలు చేయవచ్చని, సామాజిక నిఘా వ్యవస్థలు, ఆసుపత్రుల అభివృద్ధి, అంబులెన్స్ ల కోసం వినియోగించుకోవచ్చని వెల్లడించారు.