గవర్నర్ కోటా నుంచి థాకరేను ఎమ్మెల్సీగా నామినేట్ చేయాలని కేబినెట్ నిర్ణయం!
- ఉభయ సభల్లో సభ్యుడు కాని ఉద్ధవ్ థాకరే
- గవర్నర్ కోటాలో రెండు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ
- ఒక సీటును థాకరేకు ఇవ్వాలని కేబినెట్ విన్నపం
ఈ సందర్భంగా మంత్రి అనిల్ పరబ్ మాట్లాడుతూ, ఈ రెండు సీట్లలో ఒక సీటు నుంచి థాకరేను ఎంపిక చేయాలని గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీని కోరుతున్నామని చెప్పారు. కాగా, ఈ అంశం తన గురించే కావడంతో కేబినేట్ సమావేశానికి ముఖ్యమంత్రి థాకరే హాజరు కాలేదు. డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ఈ సమావేశానికి నాయకత్వం వహించారు.