Corona Virus: కరోనా పుట్టినిల్లు వూహాన్ ఇప్పుడు ఎలా ఉందంటే..!

present situation in wuhan
  • ముగిసిన 75 రోజుల లాక్ డౌన్
  • తిరిగి ప్రారంభమైన విమానాలు, రైళ్లు
  • తమ వారిని కలుసుకుంటున్న ప్రజలు
కరోనా పుట్టినిల్లుగా పేరు తెచ్చుకున్న చైనాలోని వూహాన్‌ ప్రజలు ఇప్పుడు ఎలా ఉన్నారో తెలుసా? 75 రోజుల పాటు ఇళ్లకే పరిమితమై, నానా ఇబ్బందులూ పడ్డ నగరవాసులు, ఇప్పుడు వీధుల్లోకి వచ్చేశారు. విమానాలు, రైల్ సర్వీసులు పునరుద్ధరించబడటంతో, మాస్క్ లు ధరించే తమ దైనందిన జీవితంలోకి తిరిగి వచ్చేశారు. నగరంలోని ఫ్యాక్టరీలన్నీ తిరిగి తెరచుకున్నాయి. దాదాపు కోటీ పది లక్షలకు పైగా జనాభా వుండగా, జనవరి 23 నుంచి అమలులోకి వచ్చిన లాక్ డౌన్ ను ఇప్పుడు పూర్తిగా తొలగించారు.

ఇక నగరవాసులు మాస్క్ లను ధరించి, తమ తమ పనులు చేసుకుంటున్నారు. లాక్ డౌన్ సమయంలో ఎడారిలా కనిపించిన సిటీ స్ట్రీట్స్, ఇప్పుడు ప్రజల సందడితో కళకళ్లాడుతున్నాయి. ప్రతి ఒక్కరూ తమ సన్నిహితులు, బంధువులు, తోటి ఉద్యోగులను కలుసుకుంటున్నారు. భావోద్వేగంతో కూడిన కన్నీటితో, కరోనాను జయించామని నినాదాలు చేస్తున్నారు. ఇక నగరంలో తిరిగి తెరచుకున్న దుకాణాలను విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు. వూహాన్ ఎయిర్ పోర్టుకు ప్రయాణికులతో వచ్చిన విమానానికి ఎయిర్ పోర్టు సిబ్బంది వాటర్ క్యానన్ లతో స్వాగతం పలికారు. విమానాశ్రయ సిబ్బంది సైతం రక్షణ పరికరాలను వాడుతూ, తమ విధులను నిర్వహిస్తున్నారు. 
Corona Virus
Wuhan
China

More Telugu News