'ఆచార్య'లో ప్రత్యేక పాత్రలో నిహారిక!

Acharya Movie
  • కథానాయికగా మెప్పించిన నిహారిక 
  • ముఖ్యమైన పాత్రల పట్ల ఆసక్తి 
  • 'ఆచార్య'లోను తన ఉనికిని చాటే ప్రయత్నం  
మెగా ఫ్యామిలీ నుంచి నట వారసురాలిగా వచ్చిన నిహారిక, కథానాయికగా రెండు మూడు సినిమాలు చేసింది. ఆ తరువాత ఆమె మెగా హీరోలకి చెందిన సినిమాల్లో ముఖ్యమైన పాత్రల్లో కనిపించడానికి ఎక్కువ ఉత్సాహాన్ని చూపుతోంది. ఈ నేపథ్యంలోనే చిరంజీవి చారిత్రక చిత్రమైన 'సైరా'లో ఒక ప్రత్యేక పాత్రలో మెరిసింది.

ప్రస్తుతం చిరంజీవి చేస్తున్న 'ఆచార్య' సినిమాలోను ఆమె ఒక ప్రత్యేక పాత్రలో కనిపించనుందనేది తాజా సమాచారం. అయితే ఈ విషయం అధికారికంగా తెలియాల్సి వుంది. 'ఆచార్య'లో చరణ్ ఒక కీలకమైన పాత్రను చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఆయన నక్సలైట్ నాయకుడిగా కనిపించనున్నాడని అంటున్నారు. ఇప్పుడు నిహారిక పేరు కూడా ఈ ప్రాజెక్టులో వినిపిస్తుండటంతో, మెగా అభిమానుల్లో మరింత ఆసక్తిని పెంచుతోంది. నిహారిక చేయడం నిజమే అయితే, ఆమె పాత్ర తీరు తెన్నులు ఎలా వుంటాయనేది ఆసక్తిని రేకెత్తించే అంశమే అవుతుంది.
Go Back to Shorts
Chiranjeevi
Niharika
Koratala Siva

More Telugu News