పెద్దపల్లిలో దారుణం.. వరుసగా మరణిస్తున్న శునకాలు.. స్థానికుల్లో భయాందోళనలు
- ఒక రోజులోనే 12 శునకాలు మృతి
- గ్రామంలో హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేసిన తర్వాత మరణిస్తున్న శునకాలు
- భయం వద్దన్న పశువైద్యాధికారులు
మూడు రోజుల క్రితం వైరస్ నివారణ కోసం గ్రామంలో హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేశారని, ఆ తర్వాతే శునకాలు మరణిస్తున్నాయని అన్నారు. ఆ ద్రావణం పిచికారీ చేసిన ఆహారాన్ని తినడం వల్ల కానీ, లేదంటే ఆ నీటిని తాగడం వల్ల కానీ అవి మృతి చెంది ఉంటాయని అనుమానిస్తున్నారు. అలాగే, ఆహారం దొరక్కపోవడం వల్ల కూడా మరణించి ఉండొచ్చని, భయపడాల్సిన పనేమీ లేదని అన్నారు. శునకాలు మళ్లీ మరణించినట్టు తెలిస్తే పోస్టుమార్టం చేసి అసలు విషయం తెలుసుకుంటామని ఆయన పేర్కొన్నారు.