Pushpa: 'పుష్ప' కాలికి ఆరు వేళ్లు... ఆ ట్విస్ట్ సీక్రెట్ పై ఎడతెగని చర్చ!

Sixth Finger foa Allu Arjun in PUSHPA
  • నిన్న విడుదలైన 'పుష్ప' ఫస్ట్ లుక్
  • నిశితంగా గమనిస్తే బన్నీ కాలికి ఆరు వేళ్లు
  • మెగా ఫ్యాన్స్ లో కొత్త చర్చ
బన్నీ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'పుష్ప' ఫస్ట్ లుక్ నిన్న విడుదలై నెట్టింట వైరల్ అయింది. ఇందులో అల్లు అర్జున్ గతంలో ఎన్నడూ కనిపించనంత రఫ్ లుక్ లో కనిపిస్తున్నాడు.

ఇక, ఈ పోస్టర్ ను నిశితంగా గమనిస్తే, టైటిల్ పై పుష్పరాజ్ (బన్నీ పాత్ర పేరు) వేలిముద్రలు కనిపిస్తున్నాయి. ఇదే సమయంలో ఆయన కాలికి ఆరు వేళ్లు కూడా కనపడతాయి. ఇదే ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో, మెగాభిమానుల్లో కొత్త చర్చకు తెరలేపింది. బన్నీ కాలుకు ఆరో వేలి వెనుక సీక్రెట్ ఏమైనా ఉందా? ఆ ట్విస్ట్ ఏంటన్న విషయమై ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. రెడ్ శాండల్ స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతోంది.
Pushpa
Allu Arjun
Sixth Finger

More Telugu News