Indian News Papers Society: మీడియాకు ప్రభుత్వ ప్రకటనలు ఇవ్వొద్దన్న సూచనను సోనియా ఉపసంహరించుకోవాలి: ఐఎన్ఎస్

  • ‘కరోనా’ నిధుల నిమిత్తం కేంద్రానికి  5 సూచనలు చేసిన సోనియా
  • ప్రింట్ మీడియాకు యాడ్స్ వద్దనడం కరెక్టు కాదు
  • ప్రజాస్వామ్య వ్యవస్థలో పత్రికలు ఎంతో అవసరమన్న ఐఎన్ఎస్
కరోనా వైరస్ పై పోరాటంలో భాగంగా ప్రధాని మోదీకి కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ నిన్న ఐదు సూచనలు చేసిన విషయం తెలిసిందే. ఈ సూచనలలో భాగంగా టీవీ, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాకు రెండేళ్ల పాటు ఎటువంటి యాడ్స్ ఇవ్వొద్దని ఆమె సూచన చేశారు.

ఈ సూచనపై భారతీయ వార్తా పత్రికల సంఘం (ఐఎన్ఎస్)  స్పందిస్తూ ఈ మేరకు ఓ ప్రకటన చేసింది. ఈ సూచనను ఆమె ఉపసంహరించుకోవాలని కోరింది. యాడ్స్ నిమిత్తం  జారీ చేసే సొమ్ము.. ప్రభుత్వ వ్యయం మొత్తంలో ఎంతో ఉండదని, పత్రికల మనుగడకు మాత్రం అది ఎంతో పెద్ద మొత్తం అని అభిప్రాయపడింది.
 
ఆర్థిక మాంద్యం వల్ల, డిజిటల్ మీడియా కారణంగా ప్రింట్ మీడియాకు వచ్చే ప్రకటనలు, సర్క్యులేషన్ ద్వారా వచ్చే ఆదాయం గతంలోనే తగ్గిపోయిందని గుర్తుచేసింది. లాక్ డౌన్ కారణంగా పత్రికలు తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయని తెలిపింది. ప్రజాస్వామ్య వ్యవస్థలో పత్రికలు ఎంతో అవసరమని, ఈ రంగం పట్ల ప్రభుత్వానికి ఎంతో బాధ్యత ఉందని ఆ ప్రకటనలో గుర్తు చేసిన ఐఎన్ఎస్, ఈ సూచనను ఉపసంహరించుకోవాలని విజ్ఞప్తి చేసింది.
Indian News Papers Society
Sonia Gandhi
congress
press
Ads

More Telugu News