Mumbai: ముంబయిలో మాస్క్ లు ధరించడం తప్పనిసరి.. ప్రభుత్వ ఉత్తర్వులు జారీ

Wearing protective Masks is compulsory in Mumbai
  • కరోనా హాట్ స్పాట్ గా మారిన ముంబయి
  • ఇళ్ల నుంచి బయటకు వచ్చే ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాల్సిందే
  • నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక
‘కరోనా’ హాట్ స్పాట్ గా మారిన ముంబయిలో ప్రజలు ప్రొటెక్టివ్ మాస్క్ లు ధరించాలన్న నిబంధనను తప్పనిసరి చేశారు. ఇళ్ల నుంచి బయటకు వచ్చే ప్రతి ఒక్కరూ కచ్చితంగా మాస్క్ ధరించాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ నిబంధనను ఉల్లంఘించి ఎవరైనా రోడ్లపైకి వస్తే కఠిన చర్యలు తప్పవని, అవసరమైతే అరెస్టు కూడా చేస్తామని హెచ్చరించారు.

మెడికల్ షాపుల్లో లభించే నాణ్యతతో కూడిన మాస్క్ లను లేదా శుభ్రంగా కడిగి మళ్లీ వాడే విధంగా ఉండేలా ఇళ్లల్లో తయారు చేసుకునే మాస్క్ లను ప్రజలు వినియోగించవచ్చని గ్రేటర్ ముంబై మునిసిపల్ కమిషనర్ ప్రవీణ్ పర్దేషి ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇదిలా  ఉండగా, ఇళ్ల నుంచి బయటకు వచ్చే సమయంలో తప్పనిసరిగా మాస్క్ లు ధరించాలని మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరే కూడా ప్రజలకు ఈ రోజు విజ్ఞప్తి చేశారు. కాగా, రెండు కోట్లకు పైగా జనాభా ఉన్న ముంబయి, సబర్బన్ ప్రాంతాల్లో  కరోనా పాజిటివ్ కేసులు 782 నమోదు కాగా, 50 మంది మృతి చెందారు.
Mumbai
protective Masks
Corona Virus
Greater Mumbai muncipla commissioner

More Telugu News