ప్రియురాలు వదిలి వెళ్లిపోయిందని.. హైదరాబాద్‌లో 'సాఫ్ట్‌వేర్' యువకుడి ఆత్మహత్య
- కేపీహెచ్‌బీ కాలనీలో ఘటన
- అమ్మాయితో రెండేళ్లుగా సహజీవనం
- ఆమెలేనిదే ఉండలేనని ఆత్మహత్య లేఖ
ఈ క్రమంలో ఓ యువతితో అతడికి ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి, రెండు సంవత్సరాలుగా ఆమెతో సహజీవనం చేస్తున్నాడు. నెల రోజుల క్రితం వరకు చంద్రకిరణ్ బేగంపేటలో నివాసమున్నాడు. అయితే, ఇటీవల కేపీహెచ్‌బీ పరిధిలోని తులసినగర్‌లోని ఓ అపార్టుమెంట్‌లో గది తీసుకుని ఉంటున్నాడు. ఇటీవలే చంద్రకిరణ్‌ను వదిలి యువతి వెళ్లిపోవడంతో అతడు మనస్తాపానికి గురయ్యాడు.
ఈ నేపథ్యంలో ఆ అమ్మాయి లేనిదే తాను బ్రతకలేనని ఆత్మహత్య లేఖ రాసి గదిలోనే సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకొని చనిపోయాడు. చంద్రకిరణ్‌కి అతడి సోదరుడు ఫోన్ చేయగా అతడు ఎత్తకపోవడంతో అనుమానం వచ్చి గదికి వచ్చి చూసేసరికి ఫ్యానుకి వేలాడుతూ కనపడ్డాడు. ఈ ఘనటపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.