పవన్ సినిమాలోను కనిపించనున్న చరణ్?
- చరణ్ కి విపరీతమైన క్రేజ్
- 'ఆచార్య' సినిమాలో ప్రత్యేక పాత్ర
- క్రిష్ ప్రాజెక్టులోను వినిపిస్తున్న పేరు
ఇక పవన్ సినిమాలోను చరణ్ కనిపించనున్నాడనే టాక్ తాజాగా వినిపిస్తోంది. ప్రస్తుతం 'వకీల్ సాబ్' సినిమా చేస్తున్న పవన్ కల్యాణ్, ఆ తరువాత క్రిష్ దర్శకత్వంలో ఒక చారిత్రక చిత్రం చేయనున్నాడు. ఆంగ్లేయుల పాలనా కాలం నాటి వాతావరణంలో ఈ కథ నడుస్తుంది. ఈ సినిమాలో చరణ్ కూడా కనిపించే అవకాశం ఉందనే ఒక టాక్ ఫిల్మ్ నగర్లో బలంగా వినిపిస్తోంది. ఆయన పాత్ర ఎలా ఉండనుంది? ఆయన ఎలా కనిపించనున్నాడు? అనేది ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు. ఇందులో వాస్తవమెంతన్నది చూడాలి మరి.