Multiplex: మారిపోతున్న మల్టీప్లెక్స్ లు... త్వరలోనే సినిమాల ప్రదర్శన మొదలు!

Multiplexe Theaters Changes Over Corona
  • లాక్ డౌన్ తో కుదేలైన సినీ రంగం
  • థియేటర్లలో సీట్ల మధ్య దూరం పెంచుతున్న మల్టీప్లెక్స్ లు
  • వచ్చే వారికి ఉచిత మాస్క్ లు, షో తరువాత శానిటైజేషన్
కరోనా మహమ్మారిని అడ్డుకునేందుకు ప్రపంచంలోని ఎన్నో దేశాల్లో లాక్ డౌన్ అమలవుతున్న వేళ, పలు రంగాలు ఇప్పటికే కుదేలయ్యాయి. లాక్ డౌన్ ప్రభావం సినీ పరిశ్రమపై అధికంగా ఉంది. ఇప్పటికే షూటింగ్స్ ఆగిపోగా, వేలాది మంది సినీ కార్మికులు పూట గడవని స్థితిలో ఇబ్బంది పడుతున్నారు. లాక్ డౌన్ తొలగించిన తరువాతే సినీ ప్రదర్శనలు తిరిగి ప్రారంభం అయ్యే విషయంపై స్పష్టత రాదు. ఇక, ఇప్పటికే తీవ్ర నష్టాల్లో కూరుకుపోయిన హైదరాబాద్ మల్టీప్లెక్స్ యాజమాన్యాలు, థియేటర్ల సీటింగ్ విషయంలో మార్పులు చేస్తున్నట్టుగా తెలుస్తోంది.

ఇందులో భాగంగా, సీటుకు, సీటుకు మధ్య దూరాన్ని పెంచుతున్నారు. దాదాపు 500 సీట్లు ఉండే స్క్రీన్ లో 150 మాత్రమే ఉండేలా మారుస్తున్నారని సమాచారం. ఇక, సినిమాకు వచ్చే ప్రతి ఒక్కరికీ ఓ ఫేస్ మాస్క్ ను ఉచితంగా ఇవ్వాలని, ఆపై షో ముగిసిన తరువాత, థియేటర్ అంతా శానిటైజర్లతో శుభ్రపరచాలని కూడా ఆలోచనలో ఉన్నారు. ఇందుకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని, ఇవి ఫలవంతమైతే, త్వరలోనే మల్టీప్లెక్స్ ల్లో సినిమాలు చూడవచ్చని సినీ వర్గాలు అంటున్నాయి.
Multiplex
Movies
Lockdown
Corona Virus
Seating Changes
Sanitisation

More Telugu News