Corona Virus: ఏపీలో మరో 14 మందికి కరోనా పాజిటివ్
- 266కి చేరిన కేసుల సంఖ్య
- కర్నూలులో అత్యధికంగా 56 మందికి కరోనా
- కోలుకున్న ఐదుగురు
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా బాధితుల సంఖ్య మరింత పెరిగింది. కొత్తగా 14 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని ప్రభుత్వం ప్రకటించింది. వీటితో కలిపి ఆంధ్రప్రదేశ్‌లో కరోనా బాధితుల సంఖ్య 266కి చేరింది. కరోనాతో మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. అనంతపురంలో ఒకరు, కృష్ణా జిల్లాలో ఒకరు మృతి చెందినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటివరకు కర్నూలులో అత్యధికంగా 56 కరోనా కేసులు నమోదయ్యాయి. నెల్లూరులో 34 మంది కరోనా బారిన పడ్డారు. ఇప్పటివరకు మొత్తం ఐదుగురు కరోనా నుంచి కోలుకున్నారు.
ఆయా జిల్లాలలో కరోనా బాధితుల సంఖ్య..