Telangana: తెలుగు రాష్ట్రాలకు డీమార్ట్‌ రూ.10 కోట్ల విరాళం

5 crore donation from dmart for each telangana and ap
  • మొత్తం రూ.155 కోట్ల ప్రకటన
  • ఇందులో రూ.వంద కోట్లు పీఎం కేర్స్‌కు
  • మిగిలిన మొత్తం రాష్ట్రాలకు
కరోనా వైరస్‌ కట్టడికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న చర్యల్లో తమవంతు భాగస్వామ్యంగా ప్రముఖ షాపింగ్‌మాల్‌ డీమార్ట్‌ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.5 కోట్లు చొప్పున మొత్తం రూ.10 కోట్లు సహాయం ప్రకటించింది. మొత్తం 155 కోట్ల విరాళాన్ని ప్రకటించిన సంస్థ అధినేత రాధాకిషన్ దమానీ ఇందులో రూ.వంద కోట్లు పీఎం కేర్స్‌కు కేటాయించారు. తాజాగా 11 రాష్ట్రాలకు 55 కోట్ల రూపాయలు అందించనున్నట్లు తెలిపారు. ఇందులో తెలంగాణకు రూ.5 కోట్లు, ఏపీకి రూ.5 కోట్లు అందిస్తామని తెలిపారు.
Telangana
AP
dmart
Corona Virus
donation

More Telugu News