Keerthy Suresh: షికారు చేస్తున్న పెళ్లి వార్తలపై స్పష్టత ఇచ్చిన సినీ నటి కీర్తి సురేశ్

Tollywood actress Keerthy Suresh response on marriage news
  • బీజేపీ ప్రముఖుడిని కీర్తి పెళ్లి చేసుకోబోతోందంటూ వార్తలు
  • మరో ఏడాది వరకు బిజీ అన్న నటి
  • వదంతులు ప్రసారం చేయొద్దన్న కీర్తి
తన పెళ్లికి సంబంధించి చక్కర్లు కొడుతున్న వార్తలపై ప్రముఖ నటి కీర్తి సురేశ్ స్పందించింది. బీజేపీ నేతతో ఆమెకు పెళ్లి నిశ్చయమైందని, పెళ్లి ఘనంగా జరగబోతోందని, ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయని రకరకాల వార్తలు గత రెండు మూడు రోజులుగా ఇటు ప్రధాన మీడియాలోనూ, అటు సోషల్ మీడియాలోనూ హల్‌చల్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో పెదవి విప్పిన కీర్తి.. ఆ వార్తలను ఖండించింది. ఈ వార్తల్లో ఎంతమాత్రమూ నిజం లేదని తేల్చిచెప్పింది. వదంతులను వ్యాపింప చేయవద్దని కోరింది. మరో ఏడాది వరకు కాల్‌షీట్స్ ఇచ్చానని, ఇలాంటి పరిస్థితుల్లో పెళ్లెలా చేసుకుంటానని ఎదురు ప్రశ్నించింది.
Keerthy Suresh
Marriage
Tollywood

More Telugu News