Narayanaguda: నారాయణగూడలో ఓ వ్యక్తికి కరోనా... అతని నివాసంలో 46 మంది కుటుంబ సభ్యులు!

Man tested corona positive in Narayanaguda
  • ఇటీవలే ఢిల్లీ వెళ్లొచ్చిన నారాయణగూడ వాసి
  • కరోనా నిర్ధారణ కావడంతో స్థానికుల్లో ఆందోళన
  • ఆ వ్యక్తి కుటుంబ సభ్యులకు కూడా కరోనా పరీక్షలు
హైదరాబాద్ లోని నారాయణగూడలో కరోనా భయాందోళనలు నెలకొన్నాయి. ఇటీవల ఢిల్లీ వెళ్లొచ్చిన ఆరుగురిలో ఒకరికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. మిగతా ఐదుగురి పరీక్ష ఫలితాలు రావాల్సి ఉంది. అయితే, కరోనా పాజిటివ్ గా తేలిన వ్యక్తి ఇంట్లో 46 మంది కుటుంబసభ్యులు ఉండడంతో వారికి కూడా కరోనా సోకి ఉంటుందన్న అనుమానం స్థానికులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఇప్పుడా వ్యక్తి నివాసంలో గాంధీ ఆసుపత్రి వైద్యుల పర్యవేక్షణలో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. ఇటీవల ఢిల్లీలోని ఆలమీ మర్కజ్ కు వెళ్లొచ్చిన వారిలో అత్యధికులు కరోనా బారినపడడం తెలిసిందే.
Narayanaguda
Corona Virus
Family Members
Positive
Hyderabad

More Telugu News