Corona Virus: అమెరికాలో ఒక్క రోజే 32 వేల కొత్త కేసులు.. 24 గంటల్లో 1480 మంది మృతి

 32000 new cases in US and 1480 people killed in 24 hours

  • అగ్రరాజ్యంలో  తీవ్ర ప్రభావం చూపుతున్న కరోనా
  • ఇప్పటికే 2.77 లక్షల  పాజిటివ్ కేసులు
  • మృతుల సంఖ్య 7402

కరోనా ధాటికి అగ్రరాజ్యం అమెరికా అల్లాడుతోంది. పలు దేశాల్లో ఈ ప్రాణాంతక వైరస్ విజృంభించినా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోని ఫలితంగా  అమెరికాలో పరిస్థితి చేయి దాటిపోయింది.  ఓ వైపు పాజిటివ్ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతుండగా.. అదే స్థాయిలో  మరణాలు నమోదవుతున్నాయి. 24 గంటల వ్యవధిలోనే 1480 మంది మృత్యువాత పడ్డారు.

గురువారం రాత్రి 8.30 నుంచి శుక్రవారం రాత్రి 8.30 గంటల మధ్య ఈ మరణాలు సంభవించినట్టు జాన్స్ హాఫ్కిన్స్ యూనివర్సిటీ వెల్లడించింది. మరోవైపు అగ్రరాజ్యంలో కరోనా కేసుల సంఖ్య 2 లక్షల 77 వేల 467 కు చేరింది. ఇప్పటిదాకా 7402 మంది చనిపోయారు. శుక్రవారం ఒక్క రోజే 32 వేల పైచిలుకు కొత్త కేసులు నమోదయ్యాయి.

  • Loading...

More Telugu News