India: దేశంలో 24 గంటల్లో 336 కొత్త కరోనా కేసులు: కేంద్ర ఆరోగ్య శాఖ

Total number of  COVID19 positive cases rises to in India

  • మొత్తం 2,301 కేసులు 
  • 56 మంది మృతి
  • 24 గంటల్లో ముగ్గురి మృతి 

దేశంలో కరోనా పాజిటివ్ కేసులు మరిన్ని పెరిగిపోయాయి. దేశంలో కరోనా కేసుల సంఖ్య 2183కి పెరిగిందని ఇండియన్ కౌన్సిల్‌ ఆఫ్ మెడికల్‌ రీసెర్చ్ (ఐసీఎంఆర్) ప్రకటించింది. అయితే, ఆ కొద్ది సేపటికే కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మరో ప్రకటన చేసింది. ఇప్పటివరకు దేశంలో మొత్తం 2,301 కేసులు నమోదయ్యాయని వివరించింది. వారిలో 2088 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

మొత్తం 56 మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపింది. గత 24 గంటల్లో ముగ్గురు మృతి చెందారని తెలిపింది. 24 గంటల్లో 336 కొత్త కేసులు నమోదయ్యాయని పేర్కొంది. ఇప్పటివరకు 157 మంది ఆసుపత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారని వివరించింది.

  • Loading...

More Telugu News