Jagan: పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో... అధికారులతో జగన్ సమావేశం

jagan meeting with officers
  • క్యాంపు ఆఫీసులో భేటీ
  • వైద్యులకు సదుపాయాలపై సూచనలు
  • లాక్‌‌డౌన్‌పై పలు ఆదేశాలు 
ఉన్నతాధికారులతో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌ తన క్యాంపు ఆఫీసులో సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో క్రమంగా పెరిగిపోతోన్న కరోనా కేసులపై ఆయన చర్చిస్తున్నారు. ఢిల్లీలోని నిజాముద్దీన్‌లో జరిగిన సమావేశానికి హాజరైన వారిని గుర్తించి క్వారంటైన్‌కు తరలించడంతో పాటు కరోనాపై పోరాడుతున్న వైద్యులకు పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్‌మెంట్, ఎన్ 95 మాస్కులు అందించడంపై ఆయన కీలక చర్చలు జరుపుతున్నారు.

అలాగే, లాక్‌డౌన్ పై కూడా ఆయన చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో లాక్‌‌డౌన్‌ను మరింత సమర్థవంతంగా అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులకు సూచనలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నిత్యావసరాల రవాణా, రైతులను ఆదుకునేలా తీసుకోవాల్సిన చర్యలపై కూడా ఆయన చర్చిస్తున్నారు. 
Jagan
YSRCP
Andhra Pradesh
Corona Virus

More Telugu News