Donald Trump: ట్రంప్‌కు రెండోసారి కరోనా పరీక్షలు.. ఈసారీ నెగటివ్!

US president trump once again tested corona negative
  • గత నెలలో తొలిసారి కరోనా పరీక్షలు
  • నిమిషంలో పూర్తి, పావుగంటలో ఫలితం
  • వైరస్ సోకలేదని నిర్ధారణ
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు రెండోసారి నిర్వహించిన కరోనా పరీక్షల్లోనూ నెగటివ్ రిపోర్టులు రావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. తనకు నిర్వహించిన పరీక్షల్లో కరోనా సోకలేదని తేలిందని ట్రంప్ స్వయంగా వెల్లడించారు.

ట్రంప్ ఈసారి ర్యాపిడ్ విధానంలో పరీక్షలు చేయించుకున్నారు. ఈ విధానంలో పరీక్ష నిమిషంలోనే పూర్తవుతుంది. పావుగంటలో ఫలితం వస్తుంది. ఇది ఎంతో బాగుందని, చాలా సులభతరమని ఈ సందర్భంగా ట్రంప్ పేర్కొన్నారు. కాగా, ట్రంప్ తొలిసారి గత నెల రెండోవారంలో ఇన్వాసిస్ పద్ధతిలో కరోనా పరీక్షలు చేయించుకోగా రిపోర్టు కోసం పది గంటలు వేచి చూశారు. దీంతో ఈసారి ర్యాపిడ్ విధానంలో చేయించుకుని పావుగంటలోనే రిపోర్టు అందుకున్నారు.
Donald Trump
America
Corona Virus

More Telugu News