Pawan Kalyan: 'విరూపాక్ష' టైటిల్ని రిజిస్టర్ చేయించిన క్రిష్!

Pawan Kalyan New Movie Tittle VIRUPAAKSHA
  • వరుసగా సినిమాలు చేస్తున్న పవన్
  • ఫిల్మ్ చాంబర్ లో టైటిల్ రిజిస్టర్ చేయించిన క్రిష్
  • ఇంకా వెలువడని అధికారిక ప్రకటన
దాదాపు మూడు సంవత్సరాల పాటు సినిమాలకు దూరంగా ఉన్న పవర్ స్టార్ పవన్ కల్యాణ్, ఆపై వరుసగా సినిమాలను చేస్తున్న సంగతి తెలిసిందే. పవన్ కల్యాణ్ 26వ చిత్రంగా 'వకీల్ సాబ్' షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకుంది. ఈ చిత్రంతో పాటే సమాంతరంగా మరో చిత్రం ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంది. క్రిష్ దీనికి దర్శకత్వం వహిస్తున్నారు.

ఓ చారిత్రక కథాంశం నేపథ్యంలో ఈ సినిమా సాగుతోందని, కోహినూర్ వజ్రం దొంగలించే దొంగ పాత్రలో పవన్ నటిస్తున్నారని టాలీవుడ్ వర్గాల సమాచారం. ఇక ఈ సినిమాకి 'విరూపాక్ష' అనే టైటిల్ని పెట్టనున్నట్టుగా గత కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. అందుకు తగ్గట్టుగా క్రిష్ 'విరూపాక్ష' టైటిల్ ను ఫిలిం చాంబర్లో తాజాగా రిజిస్టర్ చేయించగా, ఇది పవన్ కల్యాణ్ సినిమా కోసమేనని సోషల్ మీడియాలో వినిపిస్తోంది. ఇక ఇది పవన్ సినిమా కోసమేనా? అన్న విషయమై అధికారిక ప్రకటన వెలువడాల్సివుంది.
Pawan Kalyan
Virupaaksha
Krish
Tittle

More Telugu News