Corona Virus: ఇప్పటి వరకు ఏపీలో కోవిడ్ -19 పాజిటివ్ కేసుల సంఖ్య 143

11 New Corona Cases in Andhrapradesh
  • కృష్ణా జిల్లాలో 8 కొత్త కేసులు
  • కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో ఒక్కొక్కటి
  • 409 రిపోర్టుల కోసం వేచి చూస్తున్న అధికారులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేడు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల్లోపు 11 కొత్త కేసులు నమోదయ్యాయి. ఈ విషయాన్ని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ఆరోగ్యాంధ్ర, తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెడుతూ, "రాష్ట్రంలో ఈ రోజు (02.04.2020) ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6:00 వరకు కృష్ణా జిల్లాలో 8 కేసులు, కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో ఒక్కో కేసు నమోదు అయ్యాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో కోవిడ్ -19 పాజిటివ్ కేసుల సంఖ్య 143కి చేరింది" అని పేర్కొంది. కాగా, ఏపీలో కరోనా అనుమానితుల రక్త పరీక్షల్లో 1,321 మందికి నెగటివ్ రాగా, మరో 409 మంది పరీక్షల రిపోర్టులు రావాల్సివున్నాయి.
Corona Virus
Andhra Pradesh
New Cases

More Telugu News