వాళ్లు అజ్ఞానులే కాదు, వారి వల్ల ఇతరులకూ ప్రమాదమే: మంత్రి కేటీఆర్
- గాంధీ వైద్యులు, సిబ్బందిపై దాడిని ఖండించిన మంత్రి
- నిజామాబాద్‌లో వైద్య సిబ్బంది అడ్డగింతపై కూడా ఆగ్రహం
- అలాంటి వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని హెచ్చరిక
ఈ ఘటనలను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందని గురువారం ట్విట్టర్ ద్వారా స్పష్టం చేశారు. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. ‘గాంధీ ఆసుపత్రిలో వైద్యులు, సిబ్బందిపై దాడి, నిజామాబాద్‌లో వైద్య సిబ్బందిని అడ్డుకున్న ఘటనలను సహించేది లేదు. తెలంగాణ ప్రభుత్వం ఈ ఘటనలను తీవ్రంగా పరిగణిస్తోంది. ఇలాంటి పనులు చేసే వ్యక్తులు అజ్ఞానులే కాదు, వారివల్ల ఇతరులకు కూడా ప్రమాదమే’ అని కేటీఆర్ ట్వీట్ చేశారు.