నేడు శ్రీరామ నవమి.. ఆలయాల వద్ద కనిపించని సందడి!
- భక్తులు లేక బోసిపోయిన రామాలయాలు
- నేటి ఉదయం తిరుమలలో సీతారామ లక్ష్మణులకు తిరుమంజనం
- రేపు రాత్రి పట్టాభిషేకం
ఇక తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ ఉదయం సీతారామ లక్ష్మణులకు తిరుమంజనం నిర్వహిస్తారు. రాత్రి 10 గంటలకు బంగారు వాకిలి చెంత శ్రీరామనవమి ఆస్థాన వేడుక నిర్వహించనున్నట్టు టీటీడీ అధికారులు తెలిపారు. రేపు రాత్రి 8 గంటలకు బంగారు వాకిలి చెంత శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం నిర్వహిస్తారు. వైరస్ కలవరపెడుతుండడంతో ఈ వేడుకలన్నీ ఏకాంతంగానే నిర్వహించనున్నట్టు ఆలయ అధికారులు తెలిపారు.