Pooja Hegde: అందులో నిజం లేదన్న పూజ హెగ్డే

Pooja Hegde Movies
  • తమిళ సినిమాలకు సైన్ చేయలేదు 
  • ఆ ప్రాజెక్టులు ఓకే అయితే అదృష్టమే 
  •  త్వరలో తానే చెబుతానన్న పూజ హెగ్డే
తెలుగు తెరపై ఇప్పుడు ఇద్దరు ముద్దుగుమ్మల హవా కొనసాగుతోంది. ఒకరు పూజ హెగ్డే కాగా, మరొకరు రష్మిక. స్టార్ హీరోలతో వరుస సినిమాలు చేసేస్తూ .. వరుస విజయాలను అందుకుంటూ పూజ హెగ్డే దూసుకుపోతోంది. తెలుగుతో పాటు ఆమె తమిళ సినిమాలపై కూడా దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలోనే సూర్య సరసన ఆమె 'అరువా' సినిమా చేయనుందనే టాక్ బలంగా వినిపించింది. దర్శకుడు హరి ఆమెను కథానాయికగా ఎంపిక చేశాడని చెప్పుకున్నారు.

తాజాగా ఈ వార్తలపై పూజ హెగ్డే స్పందించింది. "హలో .. హలో మీరు తొందరపడకండి .. నేను ఇంతవరకూ ఏ తమిళ సినిమాకు సైన్ చేయలేదు. కొన్ని పెద్ద ప్రాజెక్టులైతే వచ్చాయి .. అవి కుదిరితే నేనే చెబుతాను. ఆ ప్రాజెక్టులు సెట్ అయితే అంతకు మించిన ఆనందం మరొకటి లేదు" అని చెప్పుకొచ్చింది. ప్రభాస్ సరసన .. అఖిల్ జోడీగా పూజ హెగ్డే చేసిన సినిమాలు త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.
Pooja Hegde
Prabhas
Akhil

More Telugu News