Chiranjeevi: చిరంజీవి సార్ ట్వీట్ చూసి మా ఆవిడ నా చెంప పగలగొట్టింది: పూరి జగన్నాథ్

My wife slapped me says Puri Jagannadh
  • బ్యాంకాక్ గురించి చిరు సార్ ఎందుకు ట్వీట్ చేశారో?
  • గతంలో జరిగినవన్నీ మా ఆవిడకు గుర్తుకొచ్చాయి
  • ఆ ట్వీట్ నా కొంప ముంచింది
ట్విట్టర్లోకి లేటుగా ప్రవేశించినా... మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న లేటెస్ట్ సందడి అంతాఇంతా కాదు. దర్శకుడు పూరి జగన్నాథ్ ను ఉద్దేశించి సరదాగా చేసిన వ్యాఖ్యలు సినీ అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. లాక్ డౌన్ వల్ల పూరి జగన్నాథ్ బ్యాంకాక్, ముంబై బీచ్ లను బాగా మిస్ అవుతుంటాడని చిరు ట్వీట్ చేశారు.

దీనిపై పూరి జగన్నాథ్ స్పందిస్తూ.. చిరంజీవి సార్ పెట్టిన ట్వీట్ తన కొంప ముంచిందని అన్నారు. ఇలాంటి సమయంలో బ్యాంకాక్ గురించి ఎందుకు ట్వీట్ చేశారో కానీ... మా ఆవిడ నా చెంప పగలగొట్టిందని చెప్పారు. చిరంజీవి సార్ ట్వీట్ చూసి గతంలో జరిగినవన్నీ మా ఆవిడకు గుర్తుకొచ్చాయని... దాంతో తన మీద చేయి చేసుకుందని చమత్కరించారు. 
Chiranjeevi
Puri Jagannadh
Tweet
Tollywood

More Telugu News