కష్టకాలంలో రామోజీరావు తన పెద్దమనసు చాటుకున్నారు: మాజీ మంత్రి సోమిరెడ్డి
- తెలుగు రాష్ట్రాలకు రూ.20 కోట్ల విరాళం అభినందనీయం
- ఆయనకు హృదయపూర్వక ధన్యవాదాలు
- ఆంధ్ర, తెలంగాణకు చెరో రూ.10 కోట్లు ఇచ్చిన రామోజీరావు
ముఖ్యమంత్రులను నేరుగా కలిసి నిధులు అందించేందుకు లాక్‌డౌన్ ఉన్న కారణంగా ఆన్‌లైన్‌లో ఈ నిధులను రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధికి బదిలీ చేశారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని సోమిరెడ్డి ట్విట్టర్లో స్పందించారు. కష్టకాలంలో రామోజీరావు తన పెద్దమనసు చాటుకున్నారని అభినందనలు కురిపించారు.