Chiranjeevi: టాలీవుడ్ 'సీసీసీ'కి వెల్లువెత్తిన విరాళాలు

Cr has been collected so far by CoronaCrisisCharity
  • సినీ కార్మికులను ఆదుకోవడానికి కరోనా క్రైసిస్‌ ఛారిటీ ప్రారంభం
  • ఇప్పటివరకు 6.2 కోట్ల రూపాయల సేకరణ
  • విరాళాలిచ్చిన వారికి కృతజ్ఞతలు చెప్పిన చిరు
లాక్‌డౌన్‌ కారణంగా ఇబ్బందులు పడుతున్న సినీ కార్మికులను ఆదుకోవడానికి చిరంజీవి నేతృత్వంలో ఏర్పడిన కరోనా క్రైసిస్‌ ఛారిటీ (సీసీసీ)కి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటివరకు ఎంత నిధి సమకూరిందన్న విషయాన్ని చిరంజీవి తన ట్విట్టర్‌ ఖాతా ద్వారా తెలిపారు.

'ఇప్పటివరకు 6.2 కోట్ల రూపాయలు సేకరించాం. విరాళాలు ఇచ్చిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెబుతున్నాను. ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి సాయం చేయాలని కోరుతున్నాను' అని చిరంజీవి ట్వీట్ చేశారు. విరాళాలు ఇచ్చిన సినీ ప్రముఖుల పేర్లను చిరంజీవి తన ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్ చేస్తున్నారు.
Chiranjeevi
Tollywood
Corona Virus

More Telugu News