Andrew Jack: కరోనాతో 'స్టార్ వార్స్' నటుడు ఆండ్రూ జాక్ కన్నుమూత!

Star Wars Actor Andrew Jack Passes Away due to Corona
  • రెండు రోజుల క్రితం కరోనా పాజిటివ్
  • చికిత్స పొందుతూ మరణించిన నటుడు
  • స్టార్ వార్స్ 7, 8లో నటించిన జాక్
ప్రముఖ నటుడు, 'స్టార్‌ వార్స్‌' సీరీస్ ఫేమ్‌ ఆండ్రూ జాక్‌ కరోనా వైరస్‌ సోకి, కన్నుమూశారు. ఆయన వయసు 76 సంవత్సరాలు. రెండు రోజుల క్రితం ఆయనకు జరిపిన రక్త పరీక్షల్లో కరోనా పాజిటివ్‌ వచ్చింది. దీంతో ఆయన్ను సర్రేలోని ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేర్చగా, పరిస్థితి విషమించి, మంగళవారం ఆయన చనిపోయారు.

ఈ విషయాన్ని ధ్రువీకరించిన ఆండ్రూ జాక్ ప్రతినిధి జిల్‌ మెక్ లాగ్‌, ఆయన మృతి తమకు తీరని లోటని అన్నారు. 'స్టార్‌ వార్స్‌' సీరీస్ 7, 8లో ఆండ్రూ జాక్ నటించారు. ఎంతో మందికి భాషపై మెలకువలు నేర్పారు. హాలీవుడ్ స్టార్ హీరోలు రాబర్ట్‌ డౌనీ జూనియర్‌, క్రిస్ హేమ్స్‌ వర్త్‌ లకు డయలెక్ట్‌ కోచ్‌ గానూ ఆయన వ్యవహరిస్తున్నారు.

ప్రస్తుతం జాక్ భార్య గేబ్రియల్‌ రోజర్స్‌ ఆస్ట్రేలియాలో ఉన్నారు. భర్త మరణం గురించి తెలిసిన తరువాత ఆమె స్పందిస్తూ, రెండు రోజుల క్రితం తన భర్తకు కరోనా పాజిటివ్‌ వచ్చిందని, ఆయన ఎటువంటి బాధా లేకుండా కన్నుమూశారని వెల్లడించారు.
Andrew Jack
Corona Virus
Died
corona Positive

More Telugu News