Tirumala: తిరుమలలో స్థానికుడికి కరోనా లక్షణాలు!

Corona Symptoms in Tirumala Youth

  • ఇప్పటికే నిలిచిపోయిన దర్శనాలు
  • బాలాజీ నగర్ యువకుడిలో కనిపించిన లక్షణాలు
  • కుటుంబ సభ్యులంతా పద్మావతి ఆసుపత్రికి

కరోనా వ్యాప్తి భయాందోళనల కారణంగా ఇప్పటికే భక్తుల దర్శనాలను నిలిపివేసిన తిరుమలలో, ఓ స్థానిక యువకుడికి కరోనా వైరస్ లక్షణాలు కనిపించడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. వెంటనే ఆ యువకుడిని, అతని కుటుంబీకులను ప్రత్యేక అంబులెన్స్ లో పద్మావతి ఆసుపత్రిలోని ఐసోలేషన్ వార్డుకు తరలించి, వారి రక్త నమూనాలను సేకరించి, పరీక్షల నిమిత్తం పంపించారు. తిరుమల బాలాజీ నగర్ లో ఈ యువకుడి కుటుంబం నివాసం ఉంటోందని, ఆ ఇంటి చుట్టుపక్కల వారిని హోమ్ క్వారంటైన్ చేశామని, రిపోర్టులు వచ్చిన తరువాత, తదుపరి చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు.

  • Loading...

More Telugu News