Russia: రష్యా అధ్యక్షుడు పుతిన్ ను కలిసిన డాక్టర్ కు కరోనా

doctor Met with Putin got Corona Positive in Russia
  • గత వారం కరోనా స్పెషల్ హాస్పిటల్ ను సందర్శించిన పుతిన్
  • ఆ సమయంలో పుతిన్ తోనే ఉన్న ఆసుపత్రి చీఫ్ డెనిస్
  • డెనిస్ కు కరోనా పాజిటివ్ వచ్చినట్టు నిర్ధారణ 
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ను గతవారం కలిసిన ఒక వైద్యుడికి కరోనా వైరస్ సోకడంతో రష్యాలో కలకలం రేగింది. మాస్కోలోని ఓ ఆసుపత్రిని కరోనా స్పెషల్ హాస్పిటల్ గా మార్చగా, పుతిన్ దాన్ని సందర్శించారు. పుతిన్ వచ్చిన సమయంలో ఆసుపత్రి చీఫ్‌ గా పనిచేస్తున్న డెనిస్‌ ప్రాట్సెంకొ ఆయనతో పాటే ఉండి, అక్కడి వసతులు, మౌలిక వనరులు తదితరాలను గురించి వివరించారు.

తాజాగా, డెనిస్ కు కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ విషయాన్ని అధికారికంగా ధ్రువీకరించిన అధికారులు, ఆసుపత్రిని సందర్శించిన సమయంలో పుతిన్‌, వైరస్ బారి నుంచి రక్షించే హజ్మత్‌ సూట్‌ ను ధరించి ఉన్నారని పేర్కొన్నారు. అధ్యక్షుడికి ఆరోగ్య పరీక్షలు జరిగాయని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వెల్లడించారు.

Russia
Putin
Corona Virus
Doctor
Positive

More Telugu News