India: ఇవాళ ఒక్కరోజే 13 మంది మృతి... భారత్ లో 45కి చేరిన కరోనా మరణాలు

More corona deaths in country
  • వేగంగా వ్యాపిస్తున్న మహమ్మారి
  • దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,418
  • బులెటిన్ విడుదల చేసిన కేంద్ర ఆరోగ్య శాఖ

భారత్ లో గత రెండ్రోజుల్లో కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రతరం అయింది. మరణాల సంఖ్య ఇవాళ్టికి 45కి చేరగా, పాజిటివ్ కేసుల సంఖ్య 1,418 అని కేంద్రం వెల్లడించింది. పరిస్థితి తీవ్రతకు నిదర్శనంగా ఇవాళ ఒక్కరోజే 13 మరణాలు సంభవించాయి. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. కరోనా వైరస్ నుంచి కోలుకుని 123 మంది డిశ్చార్జి అయ్యారని వెల్లడించింది. మూడు రోజుల కిందటి వరకు పరిస్థితి అదుపులోనే ఉన్నట్టు కనిపించినా ఒక్కసారిగా విస్ఫోటనం చెందిన స్థాయిలో పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. ఢిల్లీలోని మర్కజ్ లో జరిగిన ఓ మత సమావేశానికి హాజరైన వారు, వారు కలిసిన వ్యక్తులు పాజిటివ్ కేసులుగా తేలారు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా మరిన్ని పాజిటివ్ కేసులు వస్తాయన్న ఆందోళనలు వినిపిస్తున్నాయి.

  • Loading...

More Telugu News