Tim Paine: ఆసీస్ కెప్టెన్ కారులోని క్రెడిట్ కార్డు చోరీ!

Aussies captain Tim Paine car broken into and credit card was stolen
  • కరోనా కారణంగా ఇంటికే పరిమితమైన టిమ్ పైన్
  • గ్యారేజీని జిమ్ గా మార్చేందుకు ప్రయత్నం
  • కారును ఇంటి ఎదురుగా పార్కింగ్ చేసిన వైనం
  • ఇదే అదనుగా దొంగల చేతివాటం
కరోనా వైరస్ ప్రభావంతో ఇంటికే పరిమితమైన ఆస్ట్రేలియా టెస్టు క్రికెట్ జట్టు సారథి టిమ్ పైన్ కు ఊహించని ఘటన ఎదురైంది. కారులో ఉంచిన క్రెడిట్ కార్డును దొంగలు ఎత్తుకెళ్లారు. కరోనా కారణంగా ఇంట్లోనే ఉంటున్న టిమ్ పైన్ తన ఇంట్లోని కారు గ్యారేజీని ఖాళీ చేసి అందులో జిమ్ ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. గ్యారేజీలో ఉన్న కారును బయటికి తీసి ఇంటి ఎదురుగా పార్క్ చేశాడు.

అయితే నిన్న రాత్రి చూడగా, ఆ కారు డోర్ ఓపెన్ చేసి ఉండడాన్ని గమనించిన పైన్, ఆపై చోరీ జరిగినట్టు గుర్తించాడు. క్రెడిట్ కార్డు ఉన్న వాలెట్ ను దొంగలు ఎత్తుకెళ్లినట్టు తెలుసుకున్నాడు. అంతేకాదు, క్రెడిట్ కార్డును ఉపయోగించినట్టు పైన్ ఫోన్ కు సందేశం కూడా రావడంతో దిగ్భ్రాంతికి గురయ్యాడట. ఈ విషయాన్ని పైన్ స్వయంగా తెలిపాడు.
Tim Paine
Australia
Car
Credit Card

More Telugu News