తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల్లో కోత విధింపుపై జీవో జారీ
- రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని నిలకడగా ఉంచేందుకే ఈ నిర్ణయం
- ప్రభుత్వ రంగ , ప్రభుత్వ గ్రాంటు పొందుతున్న సంస్థల ఉద్యోగులకు వర్తింపు
- మార్చి నెల వేతనాల్లో కోత
- ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల చైర్ పర్సన్లు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల వేతనాల్లో- 75 శాతం
- ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ తదితర అఖిల భారత సర్వీస్ అధికారుల వేతనాల్లో- 60 శాతం
- మిగతా అన్ని క్యాటగిరీ ఉద్యోగుల వేతనాల్లో- 50 శాతం
- అన్ని రకాల రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్లలో - 50 శాతం
- నాల్గవ తరగతి, ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగుల వేతనాల్లో- 10 శాతం
- నాల్గవ తరగతి రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్లలో- 10 శాతం