Andhra Pradesh: ఐదుగురికి కరోనా పాజిటివ్ అని తేలింది: గుంటూరు జిల్లా కలెక్టర్

5 tested corona positive says Gunrur District Collector
  • ఏపీలో కరోనా వ్యాధిగ్రస్తుల సంఖ్య 40
  • ఢిల్లీ నుంచి వచ్చిన 185 మందిలో 140 మందిని గుర్తించాం
  • మిగిలిన వారు స్వచ్ఛందంగా వచ్చి పరీక్షలు చేయించుకోవాలి
ఢిల్లీలో మత ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారితో రెండు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేగుతోంది. వీరితో కాంటాక్ట్ లో ఉన్న వారికి కరోనా లక్షణాలు వస్తుండటంతో యంత్రాంగం అప్రమత్తమైంది. తాజాగా ఏపీలో కరోనా వ్యాధిగ్రస్తుల సంఖ్య 40కి చేరుకుంది.

ఈ సందర్భంగా గుంటూరు జిల్లా కలెక్టర్ శామ్యూల్ మాట్లాడుతూ, ఢిల్లీకి వెళ్లొచ్చిన 185 మందిలో 140 మందిని గుర్తించామని చెప్పారు. వీరిలో 103 మందికి పరీక్షలు నిర్వహించగా ఐదుగురికి పాజిటివ్ వచ్చిందని తెలిపారు. మిగిలిన 40 మంది కోసం గాలిస్తున్నామని చెప్పారు. వీరంతా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి టెస్టులు చేయించుకోవాలని కోరారు. ముందుకు రాకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఢిల్లీకి వెళ్లొచ్చిన వారు బయట తిరిగితే అరెస్ట్ చేస్తామని చెప్పారు.
Andhra Pradesh
Corona Virus
Guntur District
Delhi

More Telugu News