Jabardasth: వారికి దయచేసి సాయం చేయాలంటూ.. కన్నీరు పెట్టుకున్న జబర్దస్త్‌ యాంకర్‌ రష్మీ

Jabardasth anchor Rashmi breaks into tears thanks donatekart
  • విరాళాలు ఇవ్వాలని పిలుపు
  • పేదవారికి అన్నం దొరకట్లేదని ఆవేదన
  • జంతువులూ ఆహారానికి దూరమవుతున్నాయని వ్యాఖ్య
కరోనా విజృంభణ నేపథ్యంలో లాక్‌డౌన్‌ విధించడంతో పేదలు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారంటూ జబర్దస్‌ యాంకర్‌ రష్మీ గౌతమ్‌ ఆవేదన వ్యక్తం చేస్తూ కన్నీరు పెట్టుకుంది. వీధుల్లో కుక్కలు, ఆవులు కూడా ఆహారం దొరక్క ఎన్నో ఇబ్బందులు పడుతున్నాయని తెలిపింది.

పేదలకు ఫుడ్‌ దొరకట్లేదని చెప్పింది. దయచేసి అందరూ విరాళాలు ఇవ్వాలని కోరింది. కనీసం ఒక్క రూపాయి ఇచ్చినా సాయం చేసినట్లే అవుతుందని తెలిపింది. విరాళాలు అంటే పెద్ద మొత్తంలో మాత్రమే చెల్లించాల్సిన అవసరం లేదని, చాలా మంది కలిసి ఒక్కో రూపాయి సాయం చేసినా చాలా ఉపయోగపడుతుందని చెప్పింది. పేదవారు తిండికి దూరమవుతున్నారని తెలిపింది.

'ప్లీజ్‌ ప్లీజ్‌ ప్లీజ్‌.. వారికి సాయం చేద్దాం' అని రష్మీ కోరింది. మన ఇంటి పరిసరాల్లో ఉండే పేదలకు కూడా సాయం చేద్దామని పిలుపునిచ్చింది. సమాజంలో ఏర్పడిన ఇటువంటి పరిస్థితులను తాను ఎన్నడూ చూడలేదని తెలిపింది. విరాళాలు ప్రకటిస్తోన్న వారికి కృతజ్ఞతలు చెప్పింది.
Jabardasth
Rashmi Gautam
Corona Virus

More Telugu News