Rohit Sharma: భారీ విరాళాన్ని ప్రకటించిన రోహిత్‌ శర్మ

Ive done my bit to donate rohit sharma
  • పీఎం కేర్ ఫండ్స్‌కు రూ.45 లక్షలు
  • మహారాష్ట్ర సీఎం రిలీఫ్ ఫండ్‌కు 25 లక్షల రూపాయలు
  • ఫీడింగ్ ఇండియాకు రూ.5 లక్షలు
  • వీధి శునకాల సంక్షేమ నిధికి రూ.5 లక్షలు ఇస్తాను
కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు చేస్తోన్న పోరాటానికి సెలబ్రిటీల నుంచి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా, క్రికెటర్ రోహిత్ శర్మ తన వంతు సాయాన్ని ప్రకటించాడు. ఈ విషయాన్ని తన ట్విట్టర్‌ ఖాతా ద్వారా వెల్లడించాడు.

'మన దేశం తిరిగి నిలబడాల్సిన అవసరం మనకు ఉంది.. మనపై బాధ్యత ఉంది. నేను నా వంతుగా విరాళాలు ప్రకటిస్తున్నాను. పీఎం కేర్ ఫండ్స్‌కు రూ.45 లక్షలు, మహారాష్ట్ర సీఎం రిలీఫ్ ఫండ్‌కు 25 లక్షల రూపాయలు, ఫీడింగ్ ఇండియాకు రూ.5 లక్షలు, వీధి శునకాల సంక్షేమ నిధికి రూ.5 లక్షలు ఇస్తాను. కరోనాపై చేస్తోన్న పోరాటంలో ప్రధాని మోదీకి, మన నేతలకు మద్దతు తెలుపుదాం' అని ట్వీట్ చేశారు.
Rohit Sharma
Cricket
Corona Virus

More Telugu News