Vijayasai Reddy: అనారోగ్యంతో చచ్చిపోతే.. రేషన్ కోసం నిల్చుని చచ్చిపోయిందంటారా?: విజయసాయిరెడ్డి

Yellow media spreading false news says Vijayasai Reddy
  • ఎవరు చచ్చిపోతారా అని గోతికాడ నక్కల్లా ఎదురు చూస్తున్నారు
  • క్యూలో నిలబడి చనిపోయిందని దుష్ప్రచారం మొదలు పెట్టారు
  • డెడ్ బాడీని చూసి సంబరపడిపోతున్నారు
విశాఖ జిల్లాలో రేషన్ కోసం క్యూ లైన్లో నిల్చుని ఓ వృద్ధురాలు చనిపోయిందంటూ వస్తున్న వార్తలు కలకలం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎవరు చనిపోతారా? అని గోతికాడ నక్కలా ఎల్లో మీడియా ఎదురు చూస్తోందని మండిపడ్డారు. అనారోగ్యంతో వృద్ధురాలు చనిపోతే... రేషన్ కోసం క్యూలో నిలబడి చనిపోయిందంటూ దుష్ప్రచారం మొదలు పెట్టారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో కరోనా అదుపులో ఉన్నందుకు ఇప్పటికే కుళ్లికుళ్లి ఏడుస్తున్నారని... ఇప్పుడు డెడ్ బాడీని చూసి సంబరపడుతున్నారని అన్నారు.

విజయసాయిరెడ్డి ట్వీట్ పై నెటిజన్లు కూడా రకరకాలుగా స్పందిస్తున్నారు. గ్రామ వాలంటీర్లతో రేషన్ ను డోర్ డెలివరీ చేయించాలని పలువురు కోరుతున్నారు.
Vijayasai Reddy
YSRCP
Old Woman
Ration
Dead

More Telugu News