Prakash Raj: రంగస్థల నటిగా కనిపించనున్న అనసూయ

Rangamarthanda Movie
  • కృష్ణవంశీ దర్శకత్వంలో 'రంగమార్తాండ'
  • రంగస్థలం నేపథ్యంలో సాగే కథ 
  • కృష్ణవంశీ దర్శకత్వంలో 20 ఏళ్ల తరువాత రమ్యకృష్ణ
పరిచయం అవసరం లేని పేరు అనసూయ. 'రంగస్థలం' తరువాత ఆమెకి వరుస అవకాశాలు వచ్చినప్పటికీ, ఆచి తూచి పాత్రలను ఎంపిక చేసుకుంటూ వస్తోంది. కృష్ణవంశీ దర్శకత్వం వహిస్తున్న 'రంగమార్తాండ' సినిమా కోసం ఆమెను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే.

అయితే ఆమె ఏ పాత్రలో కనిపించనుందనేది అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఆమె ఈ సినిమాలో 'రంగస్థల నటి'గా కనిపించనుందనేది తాజా సమాచారం. ఊరూరా తిరుగుతూ నాటకాలు ప్రదర్శించే ఓ కళాకారిణిగా ఆమె నటిస్తున్నట్టు చెబుతున్నారు. ఆమె లుక్ కొత్తగా .. మరింత గ్లామరస్ గా ఉంటుందని అంటున్నారు.

ప్రకాశ్ రాజ్ .. రమ్యకృష్ణ ముఖ్యమైన పాత్రలను పోషిస్తున్న ఈ సినిమాను మధు - అభిషేక్ నిర్మిస్తున్నారు. 20 సంవత్సరాల తరువాత కృష్ణవంశీ దర్శకత్వంలో రమ్యకృష్ణ నటిస్తుండటం విశేషం.
Prakash Raj
Ramyakrishna
Anasuya
Rangamarthanda Movie

More Telugu News