Corona Virus: దేశంలో 31కి చేరిన కరోనా మృతుల సంఖ్య

Death toll raises in India reaches thirty one
  • పూణే, గుజరాత్ లో రెండు మరణాలు
  • 1100కి చేరువలో పాజిటివ్ కేసుల సంఖ్య
  • ఢిల్లీలో 175 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు
గత కొన్నివారాలుగా దేశంలో కరోనా విజృంభిస్తోంది. తాజాగా భారత్ లో కరోనా మరణాల సంఖ్య 31కి పెరిగింది. పూణేలో కరోనాతో 52 ఏళ్ల వ్యక్తి మృతి చెందాడు. గుజరాత్ లో కరోనాతో ఓ మహిళ మరణించింది. దేశంలోని ఇతర ప్రాంతాల్లో మరో రెండు మరణాలు చోటుచేసుకున్నాయి. అటు పాజిటివ్ కేసుల సంఖ్య 1,100కి చేరువలో ఉంది. కాగా, ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలో 175 మందికి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇటీవలే మలేసియా, ఇండోనేషియా, సౌదీ అరేబియా, కిర్గిజ్ స్థాన్ నుంచి మతప్రచారకులు రాగా, వారితో నిజాముద్దీన్ ప్రాంత వాసులు ఓ మతపరమైన సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న ఒకరు కరోనాతో మరణించడంతో మిగిలిన అందరిపైనా ఆరోగ్య నిఘా విధించారు.
Corona Virus
India
Positive
Deaths

More Telugu News