Jagan: గవర్నర్ ను కలిసిన ఏపీ సీఎం జగన్

AP CM Jagan met Governor Biswabhushan Harichandan
  • కరోనా పరిస్థితులపై వివరణ
  • లాక్ డౌన్ పరిణామాలను గవర్నర్ కు నివేదించిన సీఎం
  • ఏపీలో 23కి చేరిన పాజిటివ్ కేసులు
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తో భేటీ అయ్యారు. రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి, నివారణ చర్యలు, లాక్ డౌన్ పరిస్థితులను జగన్ గవర్నర్ కు వివరించారు. కరోనా కేసుల నమోదు, పాజిటివ్ వ్యక్తుల వివరాలు, అనుమానితుల పరిస్థితి వంటి విషయాలను గవర్నర్ కు తెలిపారు. అంతేకాకుండా, రాష్ట్రంలో లాక్ డౌన్ అమలు జరుగుతున్న తీరును వివరించారు. రాజ్ భవన్ లో గవర్నర్ తో సీఎం జగన్ భేటీ అరగంట పాటు సాగింది. కాగా, ఏపీలో ఇప్పటివరకు 23 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, మరో 100 మందికి కరోనా టెస్టులు నిర్వహించనున్నారు.
Jagan
Governor
Biswabhusan Harichandan
Andhra Pradesh
Corona Virus
Lockdown

More Telugu News