Sonusud: ‘ట్రూ లీడర్..’ అంటూ కేసీఆర్ పై నటుడు సోనూ సూద్ ప్రశంస

Bolly wood Artist Sonusud appreciates CM KCR
  • లాక్ డౌన్ తో పొరుగు రాష్ట్రాల కూలీలు ఇబ్బంది పడకుండా చూస్తామన్న కేసీఆర్
  • ఈ ప్రకటనపై బాలీవుడ్ నటుడు సోనూ సూద్ స్పందన
  • ‘ట్రూలీడర్’ కు ‘శాల్యూట్’ అంటూ పోస్ట్
లాక్ డౌన్ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో చిక్కుకుపోయిన పొరుగు రాష్ట్రాల కూలీలు ఏ ఒక్కరూ ఇబ్బంది పడకుండా చూస్తామని, వాళ్లను ఆదుకుంటామని సీఎం కేసీఆర్ నిన్న ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ప్రకటనపై బాలీవుడ్ ప్రముఖ నటుడు సోనూ సూద్ స్పందిస్తూ, కేసీఆర్ పై ప్రశంసలు కురిపించాడు. ‘ట్రూ లీడర్.. శాల్యూట్’ అంటూ సోనూ సూద్ ఓ ట్వీట్ చేశాడు. ఈ పోస్ట్ తో పాటు మీడియా సమావేశంలో కేసీఆర్ ఈ ప్రకటన చేసిన వీడియోను జతపరిచాడు.
కాగా,  తెలంగాణలో పని చేస్తున్న పొరుగు రాష్ట్రాల కూలీలందరికీ  బియ్యం, గోధుమ పిండి పంపిణీతో పాటు ఒక్కొక్కరికీ రూ.500 చొప్పున నగదు కూడా అందజేస్తామని నిన్న కేసీఆర్ ప్రకటించారు. 
Sonusud
Bollywood
Artist
kcr
TRS
Telangana
cm
Corona Virus

More Telugu News