Jagan: జగన్ చేతల మనిషి.. ప్రచారానికి ఎప్పుడూ దూరమే: విజయసాయిరెడ్డి

Jagan doesnt want publicity says Vijayasai Reddy
  • టాస్క్ విజయవంతం అయితే క్రెడిట్ ను అధికారులకు ఇస్తారు
  • లోటుపాట్లు ఉంటే ఆ బాధ్యతను ఆయనే తీసుకుంటారు
  • చంద్రబాబులా సమావేశాల హడావుడి ఇప్పుడు లేదు
కరోనా వైరస్ ప్రబలుతున్న తరుణంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నాయి. అధికారులతో క్రమం తప్పకుండా సమీక్షలు నిర్వహిస్తూ... కార్యాచరణను రూపొందిస్తున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిరోజు మీడియా ముందుకు వచ్చి, లేటెస్ట్ అప్ డేట్స్ తో పాటు ప్రభుత్వ కార్యాచరణను వివరిస్తున్నారు. ఏపీ విషయానికి వస్తే మాత్రం కేవలం మంత్రులే మాట్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ జగన్ పై ప్రశంసలు కురిపించారు.

సీఎం జగన్ చేతల మనిషని ఆయన అన్నారు. ప్రచారానికి ఆయన ఎప్పుడూ దూరంగానే ఉంటారని చెప్పారు. ఏదైనా టాస్క్ విజయవంతం అయితే ఆ క్రెడిట్ ను అధికారులకు ఇస్తారని... లోటుపాట్లు ఉంటే ఆ బాధ్యతను తానే తీసుకుంటారని అన్నారు. చంద్రబాబులా రోజుకు 16 వీడియో కాన్ఫరెన్సులు, మీడియా సమావేశాల హడావుడి ఇప్పుడు లేదని చెప్పారు. ఇదంతా పచ్చ మీడియాకు కనిపించదని ఎద్దేవా చేశారు.
Jagan
Vijayasai Reddy
YSRCP
Chandrababu
Telugudesam

More Telugu News